calender_icon.png 21 September, 2024 | 6:08 PM

బంధువుల పేరున ప్రభుత్వ భూమి

21-09-2024 01:19:08 AM

  1. 36.23 ఎకరాలు కాజేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్ యత్నం
  2. విధుల నుంచి తొలగించిన కలెక్టర్

సూర్యాపేట, సెప్టెంబర్ 20: ప్రభుత్వ భూమిని తమ బంధువుల పేరుపై ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలా ల్ పవార్ శుక్రవారం ఉద్యోగం నుంచి తొలగించారు. హుజూర్‌నగర్ మండలంలోని ప్ర భుత్వ భూముల వివరాలను పరిశీలించిన క లెక్టర్.. మండలంలోని బూరుగడ్డ గ్రామంలోని ప్రభుత్వ భూములపై అనుమానం వ చ్చింది. విచారణ చేయాలని ఆర్డీవో శ్రీనివాసులును ఆదేశించారు. ఆర్డీవో విచారణలో బూరుగడ్డ గ్రామ పరిధిలోని 36.23 ఎకరా ల ప్రభుత్వ భూమిని హుజూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ వ త్సవాయి జగదీష్ తన బంధువుల పేర్లపై ప్ర భుత్వ పోర్టల్‌లో నమోదు చేశాడని తేలింది.

2019 నుంచి ఫిబ్రవరి 2020 పేర్లు మార్చి నమోదు చేసినట్లు గుర్తించారు. అక్రమ బదిలీతో ప్రభుత్వానికి చాలా నష్టం వాటిల్లినట్లు గుర్తించిన అధికారులు.. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో పాటు భూములపై జరిగిన లావాదేవీలు పరిశీలించి పూర్తి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే నాటి తహసీల్దార్, ఇతర అధికారులపై సూక్ష్మవిచారణ జరిపేందుకు అదనపు కలెక్టర్ బీఎస్ లతను విచారణ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.