calender_icon.png 3 April, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

03-04-2025 12:12:36 AM

  1. బడా వ్యాపారవేత్తలు చేతిలో విలువైన ప్రభుత్వ భూములు
  2. స్థానికుల ఫిర్యాదుతో నామమాత్రంగా ప్రభుత్వ బోర్డులు
  3. బోర్డుల తొలగింపుపై, ప్రభుత్వ భూమిని కాపాడడంలో రెవెన్యూ అధికారుల మౌనం
  4. ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించాలంటున్న స్థానికులు

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ ౨ (విజయ క్రాంతి): అత్యంత విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ కరువయ్యింది. ఇబ్రహీంపట్నం లో ఆక్రమణకు గురైన 33 ఎకరాల ప్రభుత్వ భూమి విషయం తెరమీదికి వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో అధికారులు ఆ భూమి కాపాడడంలో విఫలం అవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ సర్వే నెం.80లో 33 ఎకరాల అసైన్డ్ భూమి ని అన్యక్రాంతమైన భూమిని గుర్తించిన రెవెన్యూ అధికారులు జేబీ రియ ల్ ఎస్టేట్ సంస్థ, గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల, హెచ్‌ఎండిఏ, పంచా యతీ వెంచర్లలో ఇటీవల ప్రభుత్వ భూమి అంటూ బోర్డులో ఏర్పాటుచేసిన విషయం విధితమే.

కానీ ప్రభుత్వ బోర్డులను అక్రమార్కులు తొలగించినప్పటికీ, వారిపై ఎలాంటి చర్యలుతీసుకోకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పేదవాడు, చిన్న కబ్జా చేస్తే కన్నెర్ర చేసే అధికారులు, బడా వ్యాపారవేత్తలు కోట్లల్లో విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు సావిస్తోంది.

ఈ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి విలువ దాదా పు రూ.200 కోట్ల విలువ ఉంటుంది. అయి తే బడా వ్యాపారవేత్తలు కావడంతో అధికారులు రాజకీయాలకు తలుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభు త్వ భూమిని కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

బోర్డులు తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటాం

ఇబ్రహీంపట్నంలోని జేబీ వెంచర్, గురునానక్ కళాశాల ఆక్రమించిన ప్రభుత్వ భూ మి బోర్డులు తొలగించారన్న విషయంపై ఇబ్రహీంపట్నం ఆర్డీవోను వివరణ కోరగా.. కబ్జా జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డులను తొలగించిన ప్రాంతాన్ని నేడు పరిశీలించి, తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

అనంతరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో