మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 8: హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ అయిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతురుణమాఫీని పూర్తిగా చేయకుండా పూటకోమాట మార్చుతూ రైతులను గందర గోళానికి గురి చేస్తుందన్నారు. రాష్ట్రంలో 2014కు ముందు ఉన్న కరెంట్ కోతలు ప్రస్తుతం కనిపిస్తున్నాయన్నారు.
సీఎం నుంచి మంత్రుల వరకు వ్యక్తిగత సంపాదన మీదే సోయి ఉన్నదని విమర్శించారు. వరదలతో లక్షలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎటు వంటి సాయం అందించకపోవడం దుర దృష్టకరం అన్నారు. ప్రభుత్వ అస మర్థతో వరద బాధితులు బురదలోనే మగ్గుతు న్నారని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.