calender_icon.png 8 April, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

08-04-2025 01:11:43 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) :  రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కట్టంగూరు, నార్కెట్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరికీ రైతుకు రైతుభరోసా అందిస్తామని తెలిపారు.

సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్నదని గుర్తు చేశారు. రైతులు దళారులను నమ్మిపోకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. అన్నదాతలు పండించిన  ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని, టార్పాలిన్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.