10-04-2025 12:52:00 AM
వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే బాధ్యత ఏఈవోలదే
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎ.కోదండరెడ్డి
ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎ. కోదండ రెడ్డి అన్నారు. విద్యా, వైద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత ఏఈఓ(వ్యవసాయ విస్తరణ అధికారులు)పై ఉంద న్నారు.
ఏ ఈ ఓల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేర కు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వ్యవసాయ విస్తరణ అధికారుల ఐక్య వేదిక అధ్యక్షులు బాదావత్ రాజ్ కుమార్ అధ్యక్షతన సమావేశానికి ముఖ్యఅతిథిగా కోదండ రెడ్డి హాజరై ఐక్యవేదిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025- నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ని ఆయన ఐక్యవేదిక ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.
అనం తరం కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ మీరే డాక్టర్లని, రైతులతో విడ తీయరాని బంధం ఉంటుందని, వ్యవసాయాన్ని గాడిన పెట్టే అపార అనుభవం ఉందని ఏఈఓలను ఉద్దేశించి అన్నారు. ఏది ఆగినా వ్యవసాయం ఆగదని, వ్యవసాయంలో కార్పొరేట్లు ప్రవేశించవద్దని అన్నా రు. దేశంలో రైతుకు, ఏఈఓల కు సెలవు ఉండదని, సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసా య కుటుంబం నుంచి వచ్చారని, ఆయనకు వ్యవసాయం మీద ఎక్కువ మక్కువ అని తెలిపారు. సలహాలు సూచనలను ఇస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఉన్న వ్యవసాయానికి పెద్దపీట వేసిందన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలు అందిస్తు న్నారని పేర్కొన్నారు.
ఐక్య వేదిక అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ క్లస్టర్లను సాగుభూమి ఆధారంగా విభజించాలని, రైతు వేదిక నిర్వహణ పెండింగ్ బకా యిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. నూతనంగా నియమించబోయే గ్రామ పాలన అధికారులను వ్యవసా య శాఖకు అనుసంధానం చేయాలని కోరారు. ఏఈఓలకు కొత్త ట్యాబ్ లను ఇవ్వాలన్నారు.
విస్తరణ అధికారులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కళ్యాణి, కోశాధికారి పి.ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ తిరుపతయ్య, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సునీత, ఆదర్శ రైతు సంఘం అధ్యక్షుడు లింగయ్య, అధికార ప్రతినిధి రవితేజ, తదితరులు పాల్గొన్నారు.