03-03-2025 08:12:01 PM
దస్తూరాబాద్ (విజయక్రాంతి): రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో ప్రజలు ఇబ్బంది పడకుండా మరింత విద్యుత్ అందించడానికి సోలార్ ప్లాంట్ నిర్మాణమే దానికి పరిష్కారం అని ప్రభుత్వాన్ని నిర్ణయించింది. దస్తురాబాద్ మండల కేంద్రంలో మహిళా సంఘాల ద్వారా నిర్మించతలపెట్టిన 1.5 మెగా వాట్స్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించగా ఆ స్థలాన్ని సోమవారం డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి పరిశీలించారు. ఆమె వెంట డీపీఎం వెంకటస్వామి ప్రసాద్, డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఎంపీడీఓ రమేష్, ఏపీఎం గంగాధర్, సీసీ లు లావణ్య, రాతిలాల్, ఆపరేటర్ వేణు తదితరులు ఉన్నారు.