calender_icon.png 13 February, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట

13-02-2025 12:00:00 AM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, ఎంపీ 

ఆమనగల్లు, ఫిబ్రవరి 12( విజయక్రాంతి ): ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గారంటీల హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని  నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు  రాష్ట్రంలో అమలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు  బురద జల్లుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని  వారు మండిపడ్డారు.

టిఆర్‌ఎస్ పార్టీ తామే మళ్లీ  అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని .. రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతారని  వారు గుర్తు చేశారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి చెప్పారు.  బుధవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని  మాడ్గుల మండలంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి  ఎంపీ మల్లురవి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అందుగుల, ఇర్విన్, మాడుగుల, కొలుకులపల్లి గ్రామాలలో బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, అంతర్గత నిర్మాణాలు, ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనులకు గ్రామాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన  ఎంపీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు డప్పు చప్పుల మధ్య వారికి ఘన స్వాగతం పలికారు.

20 గ్రామంలో  ప్రజల కోరిక మేరకు మండలం నూతన మండలం ఏర్పాటు చేయాలని,  మొత్తం తలపెట్టిన 20 రిజర్వాయర్ను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు ఎంపీ, ఏమ్మెల్యే కు వినతిలో సమర్పించారు. ప్లాకార్డులు చేత భూమి  తమ నిరసనను వెళ్లి వచ్చారు.

డీఈవో  సుసిందరావు, పిసిసి కార్యదర్శి రామ్ రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మా రెడ్డి, మాజీ జడ్పిటిసి  ప్రభాకర్ రెడ్డి,నాయకులు బట్టు కిషన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గౌడ్, జంగయ్య తాండ్ర సాయి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,జగన్, రమేష్ గౌడ్  పాల్గొన్నారు.