calender_icon.png 19 January, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీ పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

07-07-2024 01:47:13 AM

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): విద్యుత్ వాహనాలు (ఈవీ), లిథియం బ్యాటరీల తయారీ పరిశ్రమలకు ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు అందిస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు ‘ఈటో’ (ఈటీవో) ఎలక్ట్రిక్ త్రి చక్ర వాహనాల సంస్థ ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భం మంత్రి వారితో మాట్లాడుతూ.. ఈవీ వాహనాల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున విదేశీ పెట్టుబడులను తీసుకురావాలని ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాకేంద్రాల్లో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు. కంపెనీలకు ప్రోత్సాహకాలపై త్వరలో విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు.