calender_icon.png 8 November, 2024 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతున్నాం: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

19-07-2024 04:23:41 PM

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు శుక్రవారం అంతరాయం ఏర్పాడింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. విమానాలు, సూపర్‌మార్కెట్లు, బ్యాంకింగ్ కార్యకలాపాలు, స్టాక్ మార్కెట్ ప్రపంచంలోని బహుళ రంగాలకు అంతరాయం కలిగించిన విండోస్ సేవల పరిష్కరించడానికి ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతోందని కేంద్ర ఐటీ మంత్రి తెలిపారు. విమానాశ్రయ సిబ్బంది బోర్డింగ్ పాసులను చేతిలో రాసి ఇస్తున్నారు. కొన్ని పీసీల్లో విండోస్-11,10లో ఆపరేటింగ్ సిస్టమ్ లో సమస్య తలెత్తాడంతో అంతర్జాతీయంగా విమాన, బ్యాంకింగ్, స్టోరేజీ మీడియా సేవలకు అంతరాయం కలిగింది. విండోస్ లో సాంకేతిక సమస్య వల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పాడడంతో కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అమెరికాలోని ఫ్రాంటీయర్ సంస్థ ప్రకటించింది.