calender_icon.png 7 January, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

05-01-2025 08:23:40 PM

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు...

లక్షెటిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే స్థానిక అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆదివారం మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పర్యవేక్షించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం త్వరితగతులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. మూడు మండలాలు ప్రజలకు ఈ ప్రభుత్వాసుపత్రి ఉత్తమమైన సేవలందించే విధంగా అధికారులు పనిచేయాలని అన్నారు. ఆసుపత్రిలో ఎలాంటి సిబ్బంది కొరత, అన్ని రకాల సదుపాయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.