calender_icon.png 19 April, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు

03-04-2025 12:00:00 AM

పెద్దపల్లి, ఏప్రిల్ 2(విజయక్రాంతి): క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న ఒక మహిళకు అత్యవసర చికిత్స అందించి మహిళ ప్రాణాలు కాపాడారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  బుధవారం  తెలిపారు. జూలపల్లి మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన ఓ మహిళ కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స నిమిత్తం బుధవారం సాయంత్రం వెళ్ళారని.

సకాలంలో స్పందించి వైద్య బృందం మెరుగైన చికిత్స అందించి, అత్యవసరమైన శాస్త్ర చికిత్స నిర్వహించి,మహిళకు అవసరమైన రక్తాన్ని కూడా సకాలంలో సమకూర్చి చికిత్స అందించి మహిళ ప్రాణాలు కాపాడారని ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

శాస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్య బృందం బృందం డాక్టర్ స్రవంతి, డాక్టర్ స్వాతి, డాక్టర్ భవాని, మరియు జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ లను  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. అవసరమైన రోగులు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్  పేర్కొన్నారు.