19-02-2025 01:19:24 AM
* రాష్ర్ట ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి
గద్వాల, ఫిబ్రవరి 18 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టం గా అమలు చేయాలని రాష్ర్ట ముఖ్య కార్యద ర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం రాష్ర్ట ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ప్ర భుత్వ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ లతో వీ డియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిం చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలె క్టర్ బి.యం. సంతోష్ సమీకృత జిల్లా కలెక్ట రేట్ నుంచి పాల్గొన్నారు.
త్రాగు నీటి సరఫ రా, రబీ పంటలకు సాగు నీరు, డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్ కార్డు ల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలుపై ముఖ్య కార్యదర్శి సుదీ ర్ఘంగా చర్చించి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ, విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని సీఎస్ తెలిపారు.
వ్యవసాయం, గృహాలు, ఆసుపత్రులు, పరిశ్రమలకు నిరం తరాయ విద్యుత్ సరఫరా కొనసాగాలని, అవసరమైన మేర విద్యుత్తు అందుబాటులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి లోటు రావ డానికి వీలు లేదని ఆమె పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంశంలో స్థానికంగా ఏవై నా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరిం చాలని, డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని సి.ఎస్ కలెక్టర్లకు సూచిం చారు.
మిషన్ భగీరథ, పట్టణాలలో అమృ త్ క్రింద చేపట్టిన త్రాగు నీటి స్కీం, ఇతర త్రాగు నీటి స్కీంలకు, ఆసుపత్రులకు, వ్యవ సాయ ఫీడర్లకు నిరంతరాయ సరఫరా ఉం డే విధంగా ప్రత్యేకంగా పరిరక్షించాలని అ న్నారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని సబ్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేస్తూ, అక్కడ పరిస్థి తులను పరిశీలిస్తూ ఉండాలని సిఎస్ అన్నా రు. వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణ యించిందని, ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతులకు ఎకరానికి 12 వేల రూపా యలు చొప్పున పెట్టుబడి సహాయం అం దిందని, 63% పట్టాదారులు సహాయం పోందారని అన్నారు.
రైతు భరోసా పోర్టర్ లో మిగిలిన వ్యవసాయ భూముల నమో దు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు 5 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. రైతు భరోసా పై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా మండలాల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు పరిశీలించి వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ ఇ తిరుపతి రావు, ఇరిగేషన్ ఈ ఈ రహిముద్దీన్, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్ తదితరులు పాల్గొన్నారు.