calender_icon.png 27 September, 2024 | 4:56 PM

క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం

26-09-2024 01:12:56 AM

  1. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
  2. డీఎస్ స్మారక పోటీల్లో విజేతలకు బహుమతులు

 నిజామాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు  అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో నిర్వహిస్తున్న డీఎస్ స్మారక క్రీడాపోటీలను బుధవారం తిలకించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపా రు.

రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. డీఎస్ స్మారక పోటీలను నిర్వహిస్తున్న ఆయన తనయుడు సంజయ్‌ను అభినందించారు. నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ మా ట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే డీఎస్ సొసైటీ ద్వారా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

టోర్నమెంట్‌లో జిల్లా వ్యాప్తంగా 170 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఖోఖోలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మాజీ మంత్రి సుద ర్శన్‌రెడ్డి బహుమతులను అందజేశారు. డీఎస్ సొసైటీకి సుదర్శన్‌రెడ్డి రూ.50 వేల విరాళం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భక్తవత్సలం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్‌రెడ్డి, టోర్నీ నిర్వాహకులు సాయిలు పాల్గొన్నారు.