22-04-2025 04:18:39 PM
465 మార్కులతో జిల్లా మంథని మొదటి స్థానం..
మంథని (విజయక్రాంతి): మంథని ఇంటర్ బోర్డ్ మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో మంథని లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల(Government Girls Junior College) విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి సంవత్సరం ఏంపీసీ విభాగంలో గుండోజు శ్రీజ 470 మార్కులకు గాను 465 సాధించి ప్రభుత్వ కళాశాలల్లో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. అదే విధంగా హారిక శ్రీ 453/470, పెండ్యాల శ్రీనిధి, సిరి చందనలు 449/470, అక్షయ మహాలక్ష్మి 449/470 మార్కులు, బైపిసిలో సుధేష్ణ 394/440 సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో సిఈసిలో కోడెల అపర్ణ 903/1000, ఏంపీసిలో శ్రీజ 886/1000 , బైపిసిలో హరిణి 837/1000 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం పూల బోకెలు అందజేసి అభినందనలు తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా విద్యార్థులు పలితాలు సాధించడం గొప్ప విషయం అన్నారు. ప్రభుత్వ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బొల్లవరం శ్రీధర్ రావు, రావుల తిరుమల్, హనుమండ్ల నగేష్, గడ్డం మౌనిక, సిబ్బంది కుక్కల రాజన్న, అనసూయ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.