హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలోని వసతి గృహాల్లో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ పై కారణాలను తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అననపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కలిసి అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యత పర్యవేక్షించనున్నారు.
ఈ కమిటీ ఫుడ్ పాయిజన్ జరిగనప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనుంది. దీంతో పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది స్కూల్ లో వండిన వంటను రుచి చేసిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలని ప్రభుత్వం ఆదేశించింది. వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్థారించాలని ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లోనూ ఫుడ్ సేప్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.