calender_icon.png 7 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజుల నియంత్రణపై సర్కార్ ఫోకస్!

05-01-2025 12:26:59 AM

  1. త్వరలోనే ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్న విద్యాకమిషన్
  2. స్కూల్ క్యాటగిరిని బట్టి ఫీజులు ఖరారు చేయనున్న కమిషన్
  3. 15 శాతం పెంచుకునేందుకు అవకాశమివ్వాలంటున్న పాఠశాలలు
  4. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు పలు సిఫార్సులతో ఓ నివేదికను తెలంగాణ విద్యాకమిషన్ త్వరలోనే ప్రభుత్వానికి ఇవ్వనుంది.

కమిషన్ సిఫార్సులను పరి శీలించి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించి, ఫీజులకు అడ్డుకట్ట వేయాల ని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, పేరెంట్స్‌తో సమావేశాలు నిర్వహించిన తెలంగాణ విద్యాకమిషన్ వారి అభిప్రాయాలను సేకరించిం ది.

వీరందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కమిషన్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల అంశంపై ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేయనుంది. ప్రధానంగా ప్రైవేట్ పాఠ శాలల్లోని ఫీజులను నియంత్రించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో తల్లిదం డ్రుల నుం చి ఉండటంతో 2025-26 నుంచి అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం యోచిస్తోంది. 

2017లో ఫీజులపై తిరుపతిరావు కమిటీ

ఫీజుల నియంత్రణపై గత ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతిరావు చైర్మన్‌గా ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ 2017, డిసెంబర్ లో నివేదిక ఇచ్చింది. 10 శాతానికి మించకుండా ఏటా ఫీజులు పెంచుకోవచ్చని ఆ కమిటీ సిఫార్సులు చేసింది. దీనికి కొన్ని షరతులూ అప్పట్లో విధించింది. ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. ఫీజుల నియంత్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దీంతో ఫీజుల అంశం కొలిక్కి రాలేదు. ఆ తర్వాత పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కేసీఆర్ ప్రభుత్వం 2022, ఏప్రిల్‌లో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ కూడా 10 శాతం వరకు ఏటా పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ దానిపై కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

ఇప్పుడు కాకుంటే తర్వాత కష్టమే

ఈ ఏడాది జూన్‌లో విద్యాసంవత్సరం (2025-26) ప్రారంభమవుతుంది. ఇందుకు ఇప్పటి నుంచే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు అడ్మిషన్లు ప్రారంభించాయి. విద్యాసంవత్సరం ప్రారంభం జూన్ కంటే ముందే ఫీజులను నిర్ధారించాల్సి ఉం టుంది.

ఈ విద్యాసంవత్సరం కాకుంటే ఇక ఫీజులపై నిర్ధారణ ఇక కష్టమే అన్న అభిప్రాయానికి పేరెంట్స్ వస్తున్నారు. ఎలాగైనా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసి తీరుతామని ఉన్నతాధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల ఫీజులు కట్టే అంశంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

డీఎస్సీ ఫలితాలు విడుదల సమయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఫీజుల నియంత్రణపై తప్పక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీనికనుగుణంగా రాష్ర్టంలో విద్యారంగంలో తీసుకురా వాల్సిన సంస్కరణలపై మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

స్కూళ్లను బట్టే ఫీజుల పెంపుపై నిర్ణయం

ప్రైవేట్ విద్యాసంస్థలు ఏటా 10 నుంచి 30 శాతం ఫీజులు పెంచుకుంటూ బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం తో ఫీజులనేవి తల్లిదండ్రులకు పెనుభారంగా మారాయి. ఈక్రమంలోనే ముఖ్యంగా స్కూల్ క్యాటగిరీని బట్టే ఫీజుల పెంపు నిర్ణయం ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రతి క్లాస్‌కు ఎన్ని సెక్ష న్లు ఉండాలి? ఎంత విస్తీర్ణంలో తరగతి గదులుండాలి? ల్యాబ్ సౌకర్యం, ఇతరత్ర మౌలిక వసతులు, సౌకర్యాలు ఏమేరకు ఉండాలో సిఫార్సులను చేయనున్నారు. ఖర్చులు, సిబ్బంది వేతనాలు, ఆదాయ, వ్యయాలను బట్టి ఎంత ఫీజు ఖరారు చేయాలనేది నిర్ణయించనున్నారు. మూడేళ్లకోసారి? లేకుంటే ఏడాదికోసారి ఖరారు చేయాలా తేల్చనున్నారు.

విద్యాసంస్థలు ఏడాదికి 15 శాతం ఫీజుల పెంపునకు అవకాశమివ్వాలని కోరుతుండగా, విద్యాకమిషన్ మాత్రం 6.5 శాతం మించి ఆలోచనల చేయట్లేదని తెలిసింది.  ఏటా మార్కెట్ ధరలకు మధ్య వచ్చే వ్యత్యా సం, ధరల సూచీని బట్టి ఫీజును నిర్ణయించాలని విద్యాకమిషన్ భావిస్తోంది. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతుంది. 

క్యాటగిరిల వారీగా విద్యాసంస్థల విభజన

ఫీజుల నియంత్రణ చట్టంలో భాగం గా ప్రైవేట్ పాఠశాలలను నాలుగు క్యాటగిరీలుగా విభజించే యోచనలో విద్యాకమిషన్ ఉంది. ప్రధానంగా 4 క్యాటగిరీలుగా మార్చడం ద్వారా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ 4వ క్యాటగిరిగా గుర్తించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ స్కూల్స్ కంటే కొంచెం పైస్థాయిలో అంటే ఎక రం కంటే ఎక్కువ స్థలం ఉండి, దానిలో బిల్డింగ్ ఉండి, ఇన్‌ఫ్రాస్టక్చర్ ఉన్న దాన్ని 3వ క్యాటగిరీలో, 2-5 ఎకరాల మధ్య భూమి ఉండే వాటిని క్యాటగిరీ 2 లో చేర్చారు. 5 ఎకరాలు అంతకంటే మించి ఉన్న విద్యాసంస్థలను ఫస్ట్ కేటగిరిలో చేర్చినట్లు సమాచారం.