calender_icon.png 26 February, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం దృష్టి

25-02-2025 11:46:56 PM

రూ.4,030కోట్లతో 41.50కి.మీ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు..

రెండు దశల్లో నిర్మాణం..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.4,030కోట్లతో 41.50కి.మీ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఔటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్) రావిల్యాల్ ఇంటర్ చేంజ్ నుంచి అమనగల్ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. భవిష్యత్‌లో ఎనిమిది లేన్లకు పెంచేందుకు స్థలాన్ని కేటాయించారు. రెండు దశల్లో ఈ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో ఓఆర్‌ఆర్ రావిల్యాల్ ఇంటర్ ఛేంజ్ నుంచి మీర్ఖాన్‌పేట్(ఫ్యూచర్‌సిటీ) వరకు రూ.1,665కోట్లతో 19.2 కిలోమీటర్ల రోడ్డు విస్తరించనున్నారు. రెండో దశలో మీర్ఖాన్‌పేట్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ ఆమనగల్ వరకు రూ.2,365 కోట్లతో 22.30 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మించనున్నారు.