calender_icon.png 18 October, 2024 | 3:59 PM

ఒక్కో మహిళకు రూ. 2 లక్షలు ఇస్తున్నాం: మంత్రి సీతక్క

18-10-2024 02:05:20 PM

హైదరాబాద్: మూసీ నది పరివాహక స్వయం సహాయక సంఘాల మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రజాభవన్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. 172 స్వంయ సహాయక సంఘాల సభ్యులకు రూ. 3.44 కోట్ల రుణాలు మంజూరు చేశారు. సహాయ సంఘాల సభ్యులకు మంత్రి సీతక్క రూ. 2 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఏళ్లగా ఒకే దగ్గర బతికి వేరే చోటికి వెళ్లాలంటే బాధగా ఉంటుందని చెప్పారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకని జీవించాలని సూచించారు. మనం జీవించే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సీతక్క తెలిపారు. మూసీ నీళ్లలో స్నానాలు చేసి, తాగేలా పునరుజ్జీవనం చేస్తామని ఆమె పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. మూసీ నిర్వాసితుల్లోని ఒక్కో మహిళలకు రూ. 2 లక్షలు ఇస్తున్నామని సీతక్క తెలిపారు. మూడేళ్లో నెలకు రూ. 2 వేల చొప్పున 60 వేలు చెల్లిస్తే చాలు అన్నారు. రూ. 1.40 లక్షలు ఉచితంగానే ఇస్తున్నామన్నారు.