calender_icon.png 22 April, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలి

22-04-2025 01:53:24 AM

కామారెడ్డి, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి):  దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటాలని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా దోమకొండ ఉమ్మడి మండలాల, బాన్సువాడ నియోజకవర్గ  కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలుపరచలేదని చెప్పారు..

భారత ప్రభుత్వ హాయంలో తెలంగాణ గ్రామ గ్రామము అభివృద్ధి చెందిన విషయాన్ని కార్యకర్తలకు వివరించారు. రైతులకు రైతు బీమా. బంధు. ఉచిత కరెంటు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. బీడీ కార్మికులకు వికలాంగులకు వితంతువులకు పెద్ద మొత్తంలో పెన్షన్ అందించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కింది అన్నారు. ఈనెల 27న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాజీ ఎంపీపీలు శారద నాగరాజ్, బాలమణి, పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, శ్రీనివాస్,మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కుంచాల శేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు బొమ్మెర శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ గజవాడ శ్రీకాంత్,సింగిల్ విండో అధ్యక్షుడు తిరుపతి గౌడ్, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, శ్రీనివాస్ గౌడ్,సత్యం రాజిరెడ్డి ,పాలకుర్తి శేఖర్, సునీత రెడ్డి ,లలిత, గైనీ శ్రీనివాస్ గౌడ్, తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.