25 May, 2026 | 3:31 AM

కొత్త ఆసరా పింఛన్‌లు ఇవ్వని సర్కార్

25-05-2026 12:00 AM

బీజేపీ నాయకులు జాకట ప్రేమ్ దాస్

మేడ్చల్ అర్బన్ మే 24 (విజయక్రాంతి): అర్హులైన పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు కొత్త ఆసరా పింఛన్ లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని బిజెపి సీనియర్ నాయకులు జాకట ప్రేమ్ దాస్ విమర్శించారు. మేడ్చల్ లో ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.

మేడ్చల్ సర్కిల్ పట్టణంలో కొత్త ఆసరా పెంచన్ లు పంపిణీ చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారని ప్రేమ్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో చాలామంది వృద్ధులను, వికలాంగులను, వితంతువులను సైతం మోసం చేస్తున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.ఇప్పటికే అనేక దరఖాస్తులను పెండింగ్ లో పెట్టారని కొత్త పెంచన్ లు మంజూరు చేయడం లేదని పాత పెంచన్ ఉన్నవారికి మాత్రమే వివరాలు సేకరించడం జరుగుతుందని ప్రేమ్ దాస్ తెలిపారు.