calender_icon.png 17 March, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణా జలాల వినియోగంలో ప్రభుత్వం ఫెయిల్

17-03-2025 01:27:31 AM

నీళ్ల వాటా కోసం కొట్లాడిన నేత కేసీఆర్

ఆయన కృషితోనే సెక్షన్ సాధన

అసెంబ్లీ నుంచి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అనైతికం

తెలంగాణ జాతిపిత కేసీఆర్: -మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి):  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం తోనే కృష్ణా జలాలు ఏపీకి తరలిపోతున్నాయని, 24 శాతం వాటాను వాడు కోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండి పడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీ సరైన ప్రాజెక్టులు కట్టకపోవడమే కారణమని అభిప్రాయప డ్డారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు కాబట్టే కృష్ణా జలాల్లో హక్కుగా రావాల్సిన వాటా రాబట్టేందుకు నాడు ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిశారని, సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కి సెక్షన్ సాధించారని గుర్తుచేశారు.

నీటి పంపకాల విషయంలో రాష్ట్రానికి అన్యా యం జరగడానికి కారణం ఆదిత్యనాథ్‌దాస్ అని, సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను సలహాదారుగా ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపా డుపై కొట్లాడిన ఏకైక కాంగ్రెస్ నేత పీ జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) మాత్రమేనన్నారు. ఈ ఏడాది కృష్ణానదిలో 24శాతం వాటాను వాడుకోలేని దీనస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే..

రేవంత్‌రెడ్డి బూతుపితగా పేరు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగంపై హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్‌ని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడిన వ్, ప్రగతి భవన్‌ని పేల్చి పారేయాలన్న విషయాలు గుర్తుకులేవా అని అన్నారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఎలాంటి అన్‌పార్లమెంటరీ మాటలు మాట్లాడకపోయినా ఆయన్ను సస్పెండ్ చేశారని అసహనం వ్యక్తం చేశారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు సీతక్క, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్రలు చేసి కాంగ్రెస్ అధికారంలోకొస్తే వారి భూములు వారికి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వకపోగా.. మరో 15,000 ఎకరాలను సేకరిస్తామని నోటిఫికేషన్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. పదేండ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశానికి దిక్సూచిగా నిలిచిన కేసీఆర్ లాంటి నాయకుడిని పట్టుకొని మార్చురీకి పంపాలని మాట్లాడుతావా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను ఉద్దేశించి మార్చురీ అని వాఖ్యలు చేసిన.. 24 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారన్నారు. రుణమాఫీ అంశంపై కూడా హరీశ్‌రావు సీఎంపై తీవ్రస్థాయిలో స్పందించారు. రుణమాఫీపై డెడ్‌లైన్లు మారుతు న్నాయి కానీ, మాఫీ మాత్రం కావడం లేదన్నారు. ఎక్కడైనా సంపూర్ణ రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్తారా అని సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైందని, రెండోసారి అధికారం అనేది ఆయన కలేనన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని హరీశ్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శిం చారు. అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాన్ని చూస్తే ఇది అర్థమవుతుందన్నారు. మోదీ మెప్పు పొందేందుకు ఉపన్యాసం ఇచ్చినట్టు కనిపిస్తోందన్నారు.

హామీలు ఏమయ్యాయి..

మహిళలు తనను అన్నా అని పిలుస్తున్నారని రేవంత్‌రెడ్డి అంటున్నారని, మరి ఆ ఆడపడుచులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని హరీశ్‌రావు ప్రశ్నించారు.ఆడ బిడ్డలని చూడకుండా జర్నలిస్టులను జైల్లో పెట్టారన్నారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఉద్యోగాల మీద అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధమన్నారు.

కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే పాటలు మొదలయ్యాయన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర రేవంత్‌రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.  అ సెంబ్లీ సాక్షిగా దాడులు చేయిస్తానంటూ సీఎం హోదాలో ఉండి మాట్లాడవచ్చునా అని అడిగారు. బీఆర్‌ఎస్ పదేండ్లలో రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే 1 లక్షా 58 వేల కోట్ల అప్పు చేసిందన్నారు.