calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణాజలాల వినియోగంలో ప్రభుత్వం విఫలం

17-04-2025 01:41:44 AM

మేం 38 శాతం నీటిని వాడగా,  మీ హయాంలో 24 శాతం కూడా లేదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాం తి): కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతే చరిత్ర వారిని క్షమిచందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం తెలంగాణ మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణకు ద్రోహం చేసిన సీఎం, మంత్రులు ముక్కు నేలకు రాయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవా రం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశం లో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. కృష్ణా జలాల్లో 74 శాతం ఏపీ వాడుకొందని కేఆర్‌ఎంబీ ధ్రువీకరించిందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం 24 శాతం నీళ్లను కూడా వాడుకోలేకపోయిందని ఆరోపించారు. తాము హెచ్చరించిన తర్వాత కూడా ఏపీ 65 టీఎంసీలు వాడుకుందని తెలిపారు. ఏపీ జలదో పిడీపై సీఎం, మంత్రులు మాట్లాడకపోవడం సరికాదని జగదీశ్‌రెడ్డి వాపోయారు. తమ హయాంలో 38 శాతానికి పైగా వాడుకున్నామని, ముందే హెచ్చరించినా కృష్ణా జలా లను ఆంధ్రా పాలు చేశారని, తెలంగాణ ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ చేతికి వెళ్తే ఎంత ప్రమాదమో తాము చేసిన హెచ్చరికలు నిజమైయ్యాయని తెలిపారు. కృష్ణా జలాలను దక్కించుకు నేందుకు కేసీఆర్ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తారని వెల్లడించారు.