calender_icon.png 22 September, 2024 | 2:59 AM

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

22-09-2024 12:00:00 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. బాధితులందరికీ తక్షణమే సాయమందేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల కురిసిన భారీవర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, సూర్యాపేట్, వరంగల్  తదితర జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు.

అధికారిక లెక్కల ప్రకారమే 33 మంది ప్రాణాలు కోల్పోగా.. రూ.5,438 వేల కోట్ల ఆస్తి నష్టం, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రభు త్వం మరింత బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు ధీమాను కల్పించాలన్నారు. పంట న ష్టం జరిగిన రైతన్నకు ఎకరాకు మీరిచ్చే పదివేల సాయం ఏ మూలకు సరిపోదన్నారు. ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడిచినా ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం అందక బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ బోగస్ హామీ 

సింగరేణి కార్మికులకు బోనస్ పేరిట కాం గ్రెస్ బోగస్ హామీ ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు అంటూనే కంపెనీ లాభాల్లో కార్మికులకిచ్చే వాటాకు కోత విధిం చి చేదు కబురు అందజేశారన్నారు. మొత్తం రూ.4701 కోట్లలో 33శాతాన్ని కార్మికులకు బోనస్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.