మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట, అక్టోబర్ 11 (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలం అ య్యిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
బతుకమ్మ వేడుక లకు గతంలో ప్రత్యేక నిధులు కేటాయించేవారమన్నారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకల సందర్భంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయక పోవడంతో మహిళలు అసహనానికి గురయ్యారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి తప్పు ఒప్పుకుని ఆడపడుచులకు క్షమాపణలు చెప్పాలన్నారు.