calender_icon.png 31 October, 2024 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ఉన్నది వారికోసమే

05-07-2024 12:02:53 AM

మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార,  పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శ్రీలంకకు చెందిన మీడియా నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని కలిసింది. ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, తెలంగాణకు ఘనమైన సాంస్కృతిక చరిత్ర, సహజ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని, పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత  విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని వివరించారు.