- తెలంగాణ ఉద్యమ సమయంలో పెన్‌డౌన్ కీలక మలుపు
- టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో స్పీకర్ ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులది కీలక పాత్ర అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమ యంలో 42 రోజుల పాటు ఉద్యోగుల పెన్‌డౌన్ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఓపెన్ ఆడిటోరియంలో సోమవా రం ఆయన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఉద్యోగు లు ఉద్యోగంతో పాటుగా ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు.
టీఎన్జీవో మొదటి నుంచి హుందాతనంతో వ్యవహరించిందని, ప్రజల పట్ల బాధ్యతగా ఉందని ప్రశం సించారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నా రు. తమ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని పోతున్నామని తెలిపారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో ఉద్యోగులు అన్యాయానికి గురయ్యారని, తన కు ఆ బాధ చెప్పాలని ఉన్నప్పటికీ, తాను రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నందున మాట్లాడలేకపోతున్నానని అన్నారు. మన్మోహ న్ సింగ్‌కు అసెంబ్లీలో సంతాపం తెలిపేందుకు స్వయంగా తానే మాజీ సీఎం కేసీఆర్‌కు కాల్ చేసి ఆహ్వానించానని, కానీ.. కేసీఆర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేదని వాపోయారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తాను సీఎం దృష్టికి తీసుకెళ్తనని హామీ ఇచ్చా రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఉద్యోగులకు తెలుసునని, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ సరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం తప్పనిసరిగా కావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ సలహాదా రు షబ్బీర్ అలీ, శాసనమండలి సభ్యుడు కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ముజీబ్ పాల్గొన్నారు.