calender_icon.png 1 March, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగులకు సేవలతోనే గుర్తింపు

28-02-2025 10:39:42 PM

జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న వసంత్ కుమార్ ఆత్మీయ పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్ మాట్లాడుతూ.... ఉద్యోగి తన వృత్తిని అంకితభావంతో నిర్వహించి సంతృప్తికరంగా పనిచేస్తేనే సమాజంలో గుర్తింపు పొందుతారని తెలిపారు. ఉద్యోగంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి పదవి విరమణ పొందడం తప్పదన్నారు. పదవీకాలంలో వృత్తికి న్యాయం చేసి నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు పదవి విరమణ అనంతరం కూడా సంతృప్తికరమైన జీవనాన్ని సాగిస్తారని తెలిపారు. వసంత్ కుమార్ సేవలు అభినందనీయం అని పుణ్య దంపతులను జిల్లా అధికారి సంపత్ కుమార్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రమేష్, వెంకటేష్, పాష ఖాన్, శ్రీనివాస్, జిల్లాలోని పాత్రికేయులు పాల్గొన్నారు.