calender_icon.png 29 April, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగి సినీ ఫక్కీలో కిడ్నాప్

28-04-2025 11:22:05 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగి అయినా ములుగు జిల్లా కేంద్రంలో హౌసింగ్ ఏఈగా పనిచేస్తున్న ఇస్సాకు హుస్సేన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో మండల కేంద్రంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి ఏఈ ఇస్సాకు హుస్సేన్ గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మండల కేంద్రంలోని జమా మసీదులో సాయంత్రం నమాజ్ చేసిన అనంతరం బయటికి రాగా అందరూ చూస్తుండగానే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు  వాహనంలో వచ్చి ఇసాక్ హుస్సేన్ ను పట్టుకొని కొడుతూ స్థానికులు చూస్తుండగానే వాహనంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది, దీనిపై ఆతడి సోదరుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.