15-04-2025 02:45:37 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి(Rajendranagar Police Station) ఎగ్జిట్ 17 వద్ద టోల్ సిబ్బందిపై ప్రభుత్వ ఉద్యోగి(Government Employee) దాడి చేశాడు. టోల్ డబ్బులు అడిగినందుకు విచక్షణ రహితంగా దాడి చేశారు. టోల్ సిబ్బందిపై దాడి చేసిన వారిని జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్దిఖీ, కుటుంబీకులుగా గుర్తించారు. తన కారుకు టోల్ మినహాయింపు ఇవ్వాలని హుస్సేన్ సిద్దిఖీ టోల్ సిబ్బందిని కోరాడు. టోల్ మినహాయింపు లేనందున డబ్బులు చెల్లించాలని సిబ్బంది కోరాడు. దీంతో ఆగ్రహించిన హుస్సేన్ దాడికి పాల్పడ్డాడు. హుస్సేన్ రంగారెడ్డి కలెక్టరేట్(Rangareddy Collectorate)లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. హుస్సేన్ సిద్దిఖీ, కుటుంబసభ్యులపై టోల్ సిబ్బంది ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.