- ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థినికి ఆర్థిక చేయూత
- రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించిన సీఎం
హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, జూలై 24 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాదావత్ మధులతకు ఐఐటీ పట్నాలో సీటు వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోయింది. విష యం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే బాదావత్ మధులతకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. తన చదువుకు కావాల్సి న మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా జూలై 23నే అధికారులు విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ రాములు సరోజ దంపతులకు ముగ్గురు కూతుర్లు.
వీరిలో ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి, వ్యవసాయ పనుల్లో తల్లీదండ్రులకు సహాయ పడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపి ఎస్టీ కేటగిరిలో 824వ ర్యాంక్ సాధించడంతో పట్నా ఐఐటీ లో సీట్ వచ్చింది. రూ.3 లక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో ఆమె ఇంటి వద్దే ఉండి పోయింది. ఆమె ఆర్థిక పరిస్థితిని వివిధ మాధ్యమాల దారా సీఎంవో దృష్టికి చేరిం ది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ విద్యార్థినిని హైదరాబాద్ పిలిపించారు. ఆమెకు చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇక చదువుకోలేనేమో అనుకున్నా..
ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువుకోలేనేమో అని ఆందోళన చెందానని మధుల త అన్నారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా చేయూత అందించినందుకు సంతో షంగా ఉందన్నారు. సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు మధులత వివరాలు తెలుసుకొని వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ చేతుల మీదుగా మధులతకు రూ.1,51,831 చెక్కును అందజేశారు.
విద్యార్థిని కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన రూ.70 వేల కు అదనంగా మరో రూ.30 వేలు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని మధులత సీఎం రేవంత్‌రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, అకారులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజన శాఖ అధికారులు పాల్గొన్నారు.