30-04-2025 01:03:52 AM
చొప్పదండి, ఏప్రిల్29: జగంగాధర మండలం మధురానగర్ లో వివిధ గ్రామాలకు చెందిన 131 మంది లబ్ధిదారులకు రూ. 1 కోటి 31 లక్షల 15 వేల 196 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ సందర్బంగా మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మితో తెలంగాణ రాష్ర్టంలోని పేద,మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోంది అన్నారు. తెలంగాణ రాష్ర్టంలోని మహిళల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలల్లో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, పడాల రాజన్న, సత్తు కనుకయ్య,వేముల అంజి,ఎమ్మార్వో అనుపమ రావు, ఎంపీడీవో రాము తదితరులు పాల్గొన్నారు.