calender_icon.png 17 January, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

16-01-2025 10:27:01 PM

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామ్ చందర్...

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం నిరుపేదలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్ అన్నారు. గురువారం మండలంలోని ఆదిలిపేట గ్రామానికి చెందిన దుర్కి కత్తెరసాలకు మంజూరైన 40 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్(CMRF) చెక్కును బాదితునికి అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి కృషి చేస్తూనే నిరుపేదల వైద్య సహాయానికి సహాయ సహకారాలు అందిస్తుందని దీనిలో భాగంగా మండలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్ మాజీ సర్పంచులు నర్సింగోజు తిరుపతి, గోదారి రాజేష్, సీనియర్ నాయకులు కొట్రంగి పున్నం, నాయకులు ఆకుల అంజి, పెంచాల రాజలింగు, ఆకుల చందు, ఎనగందుల మల్లేష్, హనుమండ్ల అంజిలు పాల్గొన్నారు.