calender_icon.png 16 October, 2024 | 5:35 PM

మృత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

16-10-2024 03:20:44 PM

చెరువులో  చేప పిల్లలను వదిలిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల: చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే మృత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ పెద్ద చెరువులో బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేతులమీదుగా చేప పిల్లలను వదిలారు. మత్సశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమాము సందర్బంగా జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద చెరువు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ తయారు చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో వరి ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రాజు గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మత్స్యకారులు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు.