calender_icon.png 9 November, 2024 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

09-11-2024 12:45:38 AM

నర్సింహాపురంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే పద్మావతి

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి

కోదాడ, నవంబర్ 8: గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మోతే మండలంలోని నర్సింహాపురం గ్రామంలో శుక్రవారం వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజకు ఆమె హాజరై మాట్లాడారు. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.40 లక్షలు, గ్రామస్థుల విరాళాలు రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షలతో ఆలయ నిర్మాణం చేపట్టడం శుభపరిణామం అన్నారు.

అనంతరం నర్సింహారావు, ఉర్లుగొండ, తుమ్మగూడెం గ్రామాల్లోని చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, మాజీ ఎంపీపీ ముప్పాని ఆశ శ్రీకాంత్‌రెడ్డి, బయ్యా నారాయణ, మాతృనాయక మానంపాటి గుర్వారెడ్డి, నూకల మధుసూదన్‌రెడ్డి, కీసర సంతోష్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, గడ్డం రామిరెడ్డి, వీరన్న పాల్గొన్నారు.