బెల్లంపల్లి (విజయక్రాంతి): మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం రాత్రి తాండూర్ మండలంలోని బోయపల్లి పెద్ద చెరువులో అధికారులు, మత్స్యకారుల సంఘం సభ్యులతో కలిసి 9వేల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడానికే ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి మత్స్యకారుని కుటుంబానికి అండగా ఉంటామన్నారు. చేపల ఉత్పత్తి గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.
అనంతరం బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో 86 మంది లబ్ధిదారులకు రూ 86,09,776 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు కంపెల చిన్నయ్య, మత్స్యశాఖ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ సాంబశివరావు, ఏఐఎం రామ్ దాని, బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్, నాయకులు ఎస్. మహేందర్ రావు, సిరంగి శంకర్, సూరం రవీందర్ రెడ్డి, ఎండి ఈసా, సాలిగాం బానయ్య, ప్రభాకర్, తిరుపతి, నారాయణ, మహేష్ ,మిట్ట వేణుగోపాల్, రాజకుమార్, శ్రీనివాస్, వెంకటస్వామి, మత్స్య సహకార సంఘం సభ్యులు పెద్ద బోయిన రాజేశం, పెద్ద బోయిన చిన్న రాజేశం, పెద్ద బోయిన మహేష్, ఉప్పుట్ల సంతోష్, ఉప్పుట్ల రామయ్య, మత్స్య సహకార సంఘం డైరెక్టర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.