calender_icon.png 28 October, 2024 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

28-10-2024 12:14:06 AM

  1. మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 
  2. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా

సంగారెడ్డి, అక్టోబర్ 27 (విజయక్రాంతి)/ ఆందోల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసి.. అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలిపా రు.

ఆదివారం సంగారెడ్డి జిల్లాలో జోగిపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మక్త జగన్‌మో హన్‌రెడ్డి ప్రమాణాస్వీకారానికి హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.

వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం రైతు సంక్షేమం కోసం కృషి చేయలన్నారు. అనంతరం పాలకవర్గ సభ్యులు ప్రమాణాస్వీకారం చేశారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కా ర్‌తోపాటు కాంగ్రెస్ నాయకు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

జోగిపేట సర్కార్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యమందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలిపారు. ఆదివారం జోగిపేట సర్కార్ దవాఖనను ఆయన ఆకస్మకంగా తనిఖీ చేసి రోగులను పరామర్శించారు.

మెరుగైన వైద్యం అందించాలి

అస్వస్థతకు గురై సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న న్యాల్‌కల్ కస్తూర్బా గాంధీ స్కూల్ విద్యార్థినులను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. బాలికలకు మెరుగైన వైద్యమం దించాలని వైద్యులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు బాలికల వైద్యం, వారి ఆరోగ్య సమస్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్ ఉన్నారు.