14-03-2025 05:42:59 PM
మేడ్చల్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్(BRS MLA Jagadish Reddy Suspended) ను నిరసిస్తూ మేడ్చల్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకొని, లాక్కునే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు వదలకుండా దహనం చేశారు. వీరిని పోలీసులు స్టేషన్ కు తరలించి సొంత పూ చి కత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ ఎంపీపీలు జగన్ రెడ్డి, రాజ మల్లారెడ్డి, మండల కమిటీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, అకిటి నవీన్ రెడ్డి, సందీప్ గౌడ్, రాజు రెడ్డి, శ్రీనివాసరాజు, సుదర్శన్, శంకర్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.