calender_icon.png 24 January, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి

01-08-2024 02:16:20 AM

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా చూడాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరా రు. బుధవారం మండలిలో మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచి ఉన్న త విద్యవరకు నిధులు కేటాయించాల ని కోరారు. మన ఊరు, మనబడి కింద మంజూరైన పనులకు బిల్లులు తక్షణమే చెల్లించాలన్నారు. గురుకులాలు, మోడల్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి హెల్త్‌కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్యం అందించాలని సూచించారు.  

క్రీడారంగాన్ని ప్రొత్సహించాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

ప్రభుత్వం క్రీడరంగాన్ని ప్రొత్సహించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. ఈరంగంలో నేటి యువత వెనుకబడి ఉన్నదని, ఒలింపిక్స్ ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 35 పతాకాలు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. క్రీడారంగానికి అధిక నిధులు కేటాయించాలని, కొత్త క్రీడాకారులకు అవకాశం కల్పించాలని సూచించారు. గొర్రెల పంపి ణీ పథకంలో వెయ్యి కోట్ల అవకతవకలు జరిగాయని, విచారణ జరిపిం చి బాధ్యులను శిక్షించేలా చూడాలని కోరారు. ఇప్పటికే డీడీలు కట్టినవారికి వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ జలా శయాలను నింపాలని చెప్పారు. 

మహిళలపై దాడులు నివారించాలి: సత్యవతి 

మహిళలపై లైంగిక దాడులు ఎక్కువవుతున్నాయని, వాటిని నివారించేం దుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కోరారు.  షీటీమ్స్ భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను బీసీడీ గ్రూపు నుంచి ఏలో చేర్చాలని కోరారు. సాంప్రదాయ వృతిని నమ్ముకొని దయనీయ జీవితాలు సాగిస్తున్నారని చెప్పారు. బీసీ కులగణన చేయాలని, సంక్షేమ ఫలాలు ఆ వర్గాలకు అందించాలని కోరారు.