calender_icon.png 15 January, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు విద్య మరింత పటిష్ఠం

06-09-2024 01:51:13 AM

  1. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం 
  2. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
  3. నల్లగొండలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం 
  4. హాజరైన రాజ్యసభ సభ్యుడు, కవి, రచయిత విజయేంద్రప్రసాద్ 

నల్లగొండ, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): సర్కారు విద్యను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు, కవి, రచయిత విజయేంద్ర ప్రసా ద్, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, భావిపౌరుల భవిష్యత్ తీర్చిదిద్దే ఉపాధ్యాయులు దైవంతో సమానమని అభివర్ణించారు.

ఉపాధ్యాయులు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యాల్లాంటి పౌరులను అందించొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి ఉపాధ్యాయు లు, విద్యావంతులు, మేధావులు తమవంతు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకాన్ని పెంచేందుకు ఉపాధ్యా యులు నిత్య విద్యార్థులుగా మారాలని సూచించారు. అనంతరం ఉత్తమ ఉపా ధ్యాయులను శాలువా, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సంద ర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో నల్ల గొండ, భువనగిరి ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందు సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, డీఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.