23-02-2025 06:28:42 PM
మంథని (విజయక్రాంతి): ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి మద్దతుగా మంథని ప్రభుత్వ డిగ్రీ అతిథి ఆధ్యాపకుల సంఘం మద్దతు పలికింది. ఆదివారం మంథనిలో మంత్రి శ్రీధర్ బాబును మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిధి అధ్యాపకులు కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వెట్టిచాకిరి చేస్తూ ఉన్నటువంటి డిగ్రీ అతిథి అధ్యాపకుల సేవలను గుర్తించి వారికి వేతనాన్ని రూ. 50 వేలకు పెంచుతున్నట్లు తమ మేనిఫెస్టోలో చేర్చి, దాని మనుగడలో సహకరిస్తున్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని పెద్దపల్లి జిల్లా డిగ్రీ అతిధి అధ్యాపక సంఘం అధ్యక్షులు ఉడుత ముకుందం, ఉపాధ్యక్షులు అమర్నాథ్ కోరారు. ఈ సమావేశంలో అతిథి ఆధ్యాపకులు మానస, ఫర్జానా, రజిత, కృష్ణ, శ్వేత బిందు, సహజలు పాల్గొన్నారు.