calender_icon.png 6 January, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసాపై సర్కారు కుట్ర

04-01-2025 02:05:21 AM

  1. రుణమాఫీ కూడా అరకొరగానే..
  2. ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు
  3. రైతు సమస్యలపై రెండో వారంలో కిసాన్ మోర్చా నిరసనలు 
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): రైతు భరోసా పేరిట అనేక రకాల కొర్రీలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోందని, కౌలు రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచే ప్రయ త్నం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరో పించారు.

రైతులు, రైతు కూలీల పూర్తి డేటా ప్రభుత్వం వద్ద ఉన్నా కూడా రైతుభరోసాను మరింత ఆలస్యం చేసేందుకే కొత్త కొత్త నిబంధనలను తెస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతు భరోసాను మరింతగా ఆలస్యం చేసేందుకే రాష్ర్ట వ్యాప్తంగా రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నదని ఆయన ఆరోపించారు.

బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాం గ్రెస్ ప్రభుత్వానికి లేదని అందుకే రుణమాఫీ అరకొరగానే చేశారని విమర్శిం చారు. రైతు భరోసాకు కూడా కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు.

కొం దరికే రైతుభరోసా ఇచ్చే కుట్ర జరుగుతోందని, ఫలితంగా అనేక మంది అన్న దాతలకు అన్యాయం జరుగనుందన్నా రు. కేంద్రం రైతులను ఆదుకునేలా తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజనను అమ లు చేయడంలేని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలపై రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు.

రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, తర్వాత అనేక రకాల హామీలిచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ హామీలకే పరిమితమైంది తప్ప, ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్న దని.. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఆయా వర్గాలకు కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరుతో ప్రకటించిన హామీలతో తీసుకొస్తామన్న మార్పు రాష్ర్టంలో ఎక్కడా కని పించడం లేదన్నారు. జనవరి రెండో వారంలో రైతుల పక్షాన రైతుల సమస్యలపై బీజేపీ తరఫున కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్లు, మండల అధికారులు, తహసీల్దార్లకు వినతి పత్రా లు ఇచ్చి నిరసన తెలియజేస్తామన్నారు. 

తమ ప్రభుత్వం పంటలపై ఎంఎస్‌పీ పెంచింది..

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70--80 శాతం వరకు పంటలపై ఎంఎస్‌పీ పెంచిందని.. చివరి గింజ వరకు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, ధాన్యం కొనుగోలులో రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కు ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నదన్నారు.

కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న ఎంఎస్‌పీకి రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా నెలల తరబడి రైతుల ధాన్యం మార్కెట్ యార్డు ల్లో పేరుకుపోయేలా, వర్షాలకు తడిసిముద్దు మొలకెత్తేలా వ్యవహరించి, రైతుల కు అన్యాయం చేసిందన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా రాష్ర్ట ప్రభుత్వంపై భారం పడదని.. కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.