22-04-2025 09:28:55 PM
పాపన్నపేట: ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ సత్తాచాటారు. ద్వీతీయ సంవత్సరము బైపిసి విభాగంలో జంగం తేజస్విని 1000 మార్కులకు గాను 945, పి కృష్ణవేణి 943 మార్కులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు తెలిపారు. సెకండ్ ఇయర్ లో 178 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 129 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరంలో 169 మంది పరీక్ష వ్రాయగా 84 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం అభినందించారు.