calender_icon.png 19 April, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పండించిన అన్ని రకాల పంటలకు ప్రభుత్వం ₹500 బోనస్ ఇవ్వాలి

16-04-2025 04:17:40 PM

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

హుజరాబాద్ (విజయక్రాంతి): ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన అన్ని రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలోని మల్యాల గ్రామంలో బుధవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఇప్పుడు కొన్ని రకాల సన్నాళ్లకే 500 బోనస్ ఇస్తుందని అన్ని పంటలకు బోనాస్ ప్రభుత్వం ఇవ్వాలన్నారు.

చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ అధికార నిర్లక్ష్యం వల్ల చివరాయకట్ట వరకు నీళ్లు అందుతలేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు, నీరు లేక పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. కేసిఆర్ పాలనలో గత 15లో వ్యవసాయానికి రైతుకు గౌరవం దక్కిందని 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందన్నారు. కేసిఆర్ హయంలో ధాన్య ఉత్పత్తిలో తెలంగాణ 68 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2.68 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలువాలని రైతులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ కనుమల విజయ, సీనియర్ నాయకుడు వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.