calender_icon.png 23 December, 2024 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అస్తిత్వంపై సర్కార్ దెబ్బ

23-12-2024 01:02:18 AM

  1. ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిది 
  2. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ప్రజలంతా కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసి రాష్ట్ర మహిళలు, పండుగలను రేవంత్ సర్కార్ అవమానించిందని ధ్వజమెత్తారు.

అమ్మలాంటి తెలంగా ణ తల్లిని కాపాడుకోవాలని కోరారు. తెలంగాణ జాగృతి ఎన్నారై విభాగాల ఆధ్వర్యం లో ఆదివారం జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉ ద్యమంలో ఎన్నారైలు పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యమకారులు, కవు లు, కళాకారులు కలిసి రూపం ఇచ్చిన తెలంగాణ తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దా రుణమన్నారు.

ఉద్యమ తెలంగాణ తల్లి కోసం మ రో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. కొత్త తెలంగాణ తల్లికి గెజిట్ జారీ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. భారతమాత, అంబేద్కర్ , గాంధీ వి గ్రహాలకు కూడా గెజిట్ ఉందా అని ప్రశ్నించారు.

బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యా ప్తంగా గుర్తింపు రావడానికి కవిత కృషి చేశారని ఎన్నారై నాయకులు అన్నారు. సమావేశంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, జాగృతి రాష్ర్ట నాయకుడు నవీన్ ఆచారి, నాయకులు జ్యోతి, నవీన్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.