calender_icon.png 18 January, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

18-01-2025 12:00:00 AM

  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 
  • జిన్నారం మండలంలో రూ.3.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  

పటాన్ చెరు/గుమ్మడిదల,  జనవరి 17: పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిన్నారం మండల పరిధిలోని అండూరు, రాళ్లకత్వ, సొలక్ పల్లి, ఊట్ల, వావిలాల, జంగంపేట, జిన్నారం, కొర్లకుంట, కొడకంచి, అల్లినగర్ తదితర గ్రామాలలో రూ.3.90 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికా బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నామ న్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వా ములు కావాలని కోరారు.  మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన 

మండల కేంద్రమైన గుమ్మడిదలలో రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగరావు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.