calender_icon.png 28 February, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సహాయం అందించాలి

26-02-2025 12:22:53 AM

అనంతగిరి, ఫిబ్రవరి 25: మండల పరిధిలోని వసంతాపురం ఆవాస గ్రామమైన తెల్ల బండ తండ గ్రామానికి చెందిన గూగులోతు రమేష్ పుట్టుకతో వికలాంగుడు కావడంతో ఎలాంటి పనులు చేసే పరిస్థితి లేకపోవడం వలన చిన్న డబ్బా కొట్టు పెట్టుకొని జీవనం గడిస్తున్నాడు. తనకు ప్రభుత్వం నుండి మూ డు చక్రాల స్కూటీని, శిధిలావస్థలో ఉన్నడబ్బా కొట్టును పునర్ నిర్మిం చుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందించాలని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి  విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు