calender_icon.png 9 April, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ ఎస్టేట్ దళారిలా ప్రభుత్వం

07-04-2025 01:16:43 AM

  1. కంచ గచ్చిబౌలి భూముల రక్షణకు చేతులు కలపండి
  2. విద్యార్థులకు, పర్యావరణవేత్తలకు కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రియ ల్ ఎస్టేట్ దళారిలా మారి, ఎకోపార్క్ అంటూ భూములు కాజేందుకు కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ భూములను కాపాడుకునేందుకు కలసిరావాలని విద్యార్థులు, పర్యా వరణవేత్తలకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

ఎన్నో రకాల వృక్ష, జంతుజాలం ఉన్న ప్రాంతాన్ని కాపాడేందుకు దేశంలోని అన్ని రంగాల ప్రముఖులు కలసి వచ్చారని చెప్పారు. నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకునేందుకు పూర్తిస్థాయి పోరాటం చేయాలని కేటీఆర్ అన్నారు. ఈ భూముల రక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉన్నదన్నారు.