02-04-2025 12:03:47 AM
ఎమ్మెల్యే డా మురళీ నాయక్
మహబూబాబాద్ ఏప్రిల్ 1 : (విజయ క్రాంతి) మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు కేసముద్రం ఇనుగుర్తి మండలం కేంద్రాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్, ప్రారంభించారు.అనంతరం గూడూరు మండలానికి సంబందించిన (146) మంది లబ్ధిదారులకు రూ 14,616,936 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డా.మురళీ నాయక్, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం నిరుపేదలకు ఒక వరమ్మన్నారు. ఏ ప్రభుత్వాలున్నా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరు. నియోజకవర్గంలో గూడూరు మండలంలో 30,865 మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు.
ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించాం. పేదలు దొడ్డు బియ్యం తినలేరు. పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం.ఈ గడ్డ మీద నుంచి ప్రారంభించిన పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటాం.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, మేనేజర్ కృష్ణవేణి అధికారులు, ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.