23-04-2025 12:29:58 AM
పాల్వంచ ,ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవపురం జగన్నాధపురం గ్రామాల మధ్య వెలిసిన పెద్దమ్మతల్లి గుడిపాలక మండలి ప్రమాణ స్వీకారం మంగళవారం తీవ్ర ఉద్రిక్తిత నడుమ ప్రమాణ స్వీకారం జరిగింది. పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేయాలంటూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్మానికి పాల్పడ్డారు.
కొందరు మహిళలు ఆలయ ప్రాంగణంలో గాజుల పలగొట్ట నిరసన తెలిపారు. ముందుగానే ఊహించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవలనే పెద్దమ్మ తల్లి గుడికి కొత్తగా పాలక మండలి నియమించారు. జిల్లాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు చేరో కమిటీని వేసుకున్నారు.
ఈ కమిటీలో ఆలయ కమిటీ చైర్మన్ పదవి స్థానికేతరుడికి కట్టబెట్టడంతో స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం ఎదురైంది. గతంలోనే ప్రమాణస్వీకారం జరిగే సమయంలో యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తో ప్రమాణస్వీకారం వాయిదా వేశారు.
తిరిగి మంగళవారం ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్న క్రమంలో తీవ్ర నిరసన ఎదురయింది. పరిస్థితినే ముందుగానే పసి గట్టిన అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసుల రంగ ప్రవేశమై ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
అధికారులు పాలక మండల చేత ప్రమాణస్వీకారం చేయించారు. పోలీసు బందోబస్తు నడుమ ప్రమాణ స్వీకారం ముగించారు. దీంతో కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరు బహిర్గతమై రచ్చకెక్కింది.