calender_icon.png 21 January, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో ఐదు ఏఎంసీలకు పాలకవర్గాలు

01-09-2024 12:51:51 AM

 వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల 

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి):  రాష్ర్టవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలంటికి త్వరలో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం కొత్తగా ౫ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ర్టవ్యాప్తంగా 44 కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించినట్లు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, ఆలంపూర్, జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, ధర్మపురి, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించినట్లు పేర్కొన్నారు.

గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కుర్వ హనుమంతు, వైస్‌చైర్మన్‌గా గంగిరెడ్డి శ్రీకాంత్, ఆలంపూర్‌కు ఉప్పరి దొడ్డెన్న, వైస్ చైర్మన్‌గా  రుక్మందర్ రెడ్డి , గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్‌గా బీమ సంతోష్ , వైస్ చైర్మన్‌గా పురపాటి రాజిరెడ్డి, ధర్మపురికి చిలుముల లావణ్య, వైస్ చైర్మన్‌గా సంగ నర్సింహులు,  గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వంటే రు నరేందర్ రెడ్డి , వైస్ చైర్మన్‌గా మహ్మద్ సర్దార్ ఖాన్ ను నియమించినట్లు తెలిపారు.